← Back to headlines

ఐపిఎల్ 2026.. ప్లేఆఫ్‌కి మూడు వేదికలు.. ఫైనల్ ఎక్కడంటే..?

2026-05-06 11:54 • original

ఐపిఎల్ 19వ తుది దశకు చేరుకుంది. త్వరలోనే లీగ్ దశ మ్యాచులు ముగించుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతోంది. లీగ్ దశలో టాప్‌లో ఉన్న నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి. ఇందులో క్వాలిఫయర్-1లో టాప్‌లో ఉన్న రెండు జట్లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌‌లో తలపడతాయి. ఇందులో ఓడిన జట్టు ఇంటికి గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో తలపడతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది

ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ వేదికలను బిసిసిఐ ఖరారు చేసింది. అలాగే ఫైనల్‌కు బెంగళూరు కాకుండా.. అహ్మదాబాద్‌ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మే 24తో లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం నాకౌట్ మ్యాచులు మొదలవుతాయి. ఇందులో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ధర్మశాలలో మే 26న జరుగుతుంది. ఆ తర్వాత మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మే 29న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 31న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.