
హైదరాబాద్: తమ అసోసియేషన్ పేరులో మార్పులు చేసి, కొందరు మోసాలకు పాల్పడుతున్నారన్నది తమ దృష్టికి వచ్చిందన్న తెలిపింది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. AP MAA, MAA AP పేర్లతో కన్‌ఫ్యూజ్ చేస్తూ నటులు, ప్రజలను మోసగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొంది. ‘మా’తో సంబంధం ఉందని నమ్మిస్తూ.. నటుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారనే సమాచారం కూడా అందిందని తెలిపింది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ‘మా’ ఆఫీసులో తెలియజేయాలని కోరింది. తమకు ఎలాంటి అనుబంధ అసోసియేషన్లు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.