
హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఎ కెటిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఎంఎల్ సి అద్దంకి దయాకర్ విమర్శించారు. కెటిఆర్ కౌంటర్ కు అద్దంకి రీకౌంటర్ ఇచ్చారు. మాజీ సిఎం కెసిఆర్ గురించి కాంగ్రెస్ నేతలు మర్యాదగా మాట్లాడాలని కెటిఆర్ అంటున్నారని, కానీ సిఎం రేవంత్‌పై కెటిఆర్ మర్యాద ఎందుకు మరిచారని ప్రశ్నించారు. ఇకపై కెటిఆర్ మాట్లాడిన భాషతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. కెటిఆర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరెక్ట్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చర్చిద్దామని సవాల్ విసిరారు. పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. సిబిఐ విచారణ అంటే బిఆర్ఎస్ కు భయం పట్టుకుందని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కెటిఆర్ తో తిట్ల పోటీకి తాము రెడీగా ఉన్నాయని అద్దంకి దయాకర్ తెలిపారు.